![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శుక్రవారం 224 లో... సందీప్, శ్రీవల్లిలు సీతాకాంత్ , రామలక్ష్మిలకి గొడవ పెట్టాలని చూస్తారు. కానీ రామలక్ష్మి రివర్స్ గా శ్రీలతకి భోజనం తినిపిస్తుంది. ఏంటి అత్తయ్య నేను తినిపిస్తే.. తినరా అని రామలక్ష్మి అంటుంది. నన్ను క్షేమించలేదా అని అనగానే.. ఎందుకు రిస్క్ అని శ్రీలత అనుకుంటుంది. ఆలా ఏం లేదు సరే అంటూ భోజనం తింటుంది. ఆ తర్వాత సీతాకాంత్ కి రామలక్ష్మి తినిపిస్తుంటే వద్దని అంటాడు. చూడండి అత్తయ్య అని రామలక్ష్మి అనగానే సీతా తిను అంటుంది. దాంతో సీతాకాంత్ తింటాడు.
ఆ తర్వాత మాణిక్యం డ్రింక్ చేసి వస్తాడు. దాంతో సుజాత తిడుతుంది. మాణిక్యం ఏడుస్తూ ఉంటాడు. అక్కడ జరిగింది మొత్తం చెప్తూ బాధపడతాడు. నాకు చాలా సంతోషంగా ఉంది.. మీరు ఇప్పుడు ఒక మంచి తండ్రి లాగా ఆలోచిస్తున్నారని సుజాత అంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ తలనొప్పితో బాధపడుతుంటే.. అప్పుడే రామలక్ష్మి వచ్చి బామ్ రాస్తుంది.. చాలు వద్దని అయిష్టం గా సీతాకాంత్ అంటుంటే.. మీకు తెలియదంటూ ఇంకా రాయబోతుంటే వద్దని ఆపుతాడు. మీరు ఇలా కాదు అత్తయ్య అంటూ రామలక్ష్మి అనగానే వద్దని సీతాకాంత్ అంటాడు. సీతాకాంత్ కి బామ్ రాస్తుంది. అలాగే పడుకుంటాడు. రామలక్ష్మి చెయ్యి పట్టుకొని పడుకుంటాడు. రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఆ రామలక్ష్మిని మనం ఏదో ఒకటి చెయ్యాలనుకుంటే తనే ఒకటి చేస్తుంది. ఇద్దరి మధ్య దూరం పెంచాలనే కదా రౌడీ తో అబద్ధం చెప్పించింది కానీ ఇప్పుడు రామలక్ష్మి ఇలా చేస్తుందని శ్రీవల్లి అంటుంది. మరొకవైపు మనం శ్రీలతతో చేతులు కలిపి తప్పు చేసామా.. రామలక్ష్మికి సీతాకాంత్ కీ ఒకరంటే ఒకరు చాలా ఇష్టమని నందినితో హారిక అంటుంది. సీతాకి తల్లి ఎక్కువ.. భార్య ఎక్కువ అంటే.. తల్లి ఎక్కువ అంటాడు. శ్రీలతని అడ్డు పెట్టుకొని రామలక్ష్మిని బయటకు పంపించి.. ఆ ప్లేస్ లకి నేను వెళ్తానని నందిని అంటుంది. మరొకవైపు నందిని ఈ ఇంట్లో అడుగుపెట్టగానే.. రామలక్ష్మి బయటకు అడుగుపెడుతుందని శ్రీలత అంటుంది. ఆ తర్వాత హటాస్ప్ మంచి ప్లాన్ అని హారిక అనగానే.. నా సీతా కోసం ఏమైనా చేస్తానని నందిని అంటుంది. మరొకవైపు ఆస్తుల కోసం ఏమైనా చేస్తానని శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |